గాజువాక
విశాఖలో రెచ్చిపోయిన విద్యార్థులు
విశాఖలో మరోసారి విద్యార్థులు రెచ్చిపోయారు. విశాఖ జిల్లా మధురవాడలో రెండు గ్రూపులుగా విడిపోయి రోడ్డుపైనే దాడులు చేసుకున్నారు. శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎందుకు దాడులు చేసుకున్నారో ఇంకా తెలియ రాలేదు. విద్యార్థులు దాడులు చేసుకుంటే స్థానికులు చోద్యం చూశారు. ఇటీవల గోపాలపట్నం లో కూడా ఇదే తరహాలో విద్యార్థులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.