లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంతో 80,234 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 80 పాయింట్ల లాభంతో 24,274.90 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.44గా ఉంది. అదానీ పోర్ట్స్, NTPC, HDFC బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ముగిశాయి. టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, SBI, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి.