బెల్లంపల్లి
తాండూర్: గృహ హింస కేసులో ఒకరికి ఏడాది జైలు
గృహహింస కేసులో కాగజ్ నగర్ మండలానికి చెందిన చిలుక తిరుపతికి ఏడాది జైలు శిక్షతోపాటు 1000 జరిమానా విధిస్తూ బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముఖేష్ తీర్పునిచ్చినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ బుధవారం తెలిపారు. తిరుపతి తాండూరు మండలానికి చెందిన జ్యోతితో వివాహం జరగగా భర్తతోపాటు అత్తమామలు వేధిస్తున్నారని కేసు నమోదు అయింది. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు.