Top 10 viral news 🔥
చంద్రబాబు పాలనలో బాధాకరమైన పరిస్థితులు: జగన్
రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. హామీల అమలు లేకపోగా.. స్కాంల పాలన నడుస్తోందని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. అయితే, కూటమి పాలనలో తిరోగమనంలో ఇప్పుడు రాష్ట్రం ఉందని పేర్కొన్నారు. రెడ్‌బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు.