వైసీపీ నేత అపార్ట్మెంట్లో తనిఖీలు
AP: వైసీపీ నేత అంబటి మురళీకృష్ణకు చెందిన అపార్ట్మెంట్లో మరోసారి తనిఖీలు జరుగుతున్నాయి. నిర్మాణాలకు రైల్వే ఎన్వోసీ రద్దు లేఖను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర బయటపెట్టిన విషయం తెలిసిందే. ఎన్వోసీ రద్దు చేసిన తర్వాత కూడా నిర్మాణం జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పట్టాభిపురంలోని బహుళ అంతస్తుల నిర్మాణాలను గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు, రైల్వేశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.