భద్రాచలం
దుమ్ముగూడెం: టేకు కలప పట్టివేత
దుమ్ముగూడెం మండల పరిధి చింతగుప్ప గ్రామ సమీపంలో అక్రమ టేకు, కలపను అటవీ శాఖ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. సుమారు లక్ష విలువగల 11 టేకు దిమ్మలను స్మగ్లర్లు దాచి ఉంచారన్న సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు దాడులు చేసి కలపను స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి కమల కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.