కస్తూర్బా పాఠశాల తనిఖీ చేసిన అలంపూర్ ఎమ్మెల్యే
ఉండవెల్లి మండలం కలుగోట్ల గ్రామంలోని కస్తూర్బా పాఠశాలను మంగళవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న భోజనం మెనూను పర్యవేక్షించి, నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి హాస్టల్ వసతులను పరిశీలించారు.