
దేవరకద్ర నియోజకవర్గం
పారుపల్లి జడ్పీహెచ్ఎస్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ కొండ మండలం పారుపల్లిలో జడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. పాఠశాలలో మౌలిక వసతులు, విద్యార్థులకు హెల్త్ చెకప్, కంటి పరీక్షల నిర్వహణ గురించి అడిగి సూచనలు చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. భోజనం ఎలా ఉందని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.






























