VIDEO: కూలిపోయిన శివాజీ భారీ విగ్రహం
మహారాష్ట్ర-మాల్వాన్లోని సింధుదుర్గ్ కోటలో భారీ శివాజీ విగ్రహం కూలిపోయింది. గతేడాది ఏర్పాటు చేసిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం నేలకూలింది. 2023, డిసెంబర్ 4న ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం షిండే దీనిని ప్రారంభించారు. విగ్రహం ప్రారంభించిన 9 నెలలకే కూలిపోవడం గమనార్హం. భారీ వర్షాల కారణంగా విగ్రహం కూలినట్లు సమాచారం.