బ్లాక్లో దర్శన టికెట్లు.. మాజీ మంత్రులపై టీడీపీ ఆరోపణలు
తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లను మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, రోజా అమ్ముకున్నారని టీడీపీ ఆరోపించింది. కళాధర్ ట్రావెల్స్ పేరుతో పెద్దిరెడ్డి, బుక్ మై దర్శన్ పేరుతో ఆర్కే రోజా పరోక్షంగా టీటీడీ దర్శనాల విషయంలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని తెలిపింది. అప్పటి మంత్రులు పెద్దిరెడ్డి, రోజా.. శ్రీవారి దర్శనం టికెట్లు బ్లాక్లో అమ్మించి రోజుకి రూ.కోటి వరకూ దండుకున్నారని TDP పేర్కొంది.