మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)
పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నగరంలోని బిధాన్ మార్కెట్లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఇప్పటివరకు ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు లభ్యం కాలేదు. అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు వ్యాపించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.