అమెజాన్ ఇండియా నూతన అధిపతిగా సమీర్కుమార్ నియామకం
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా అధిపతిగా సమీర్కుమార్ నియమితులయ్యారు. ఆయన అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఇవాళ ప్రకటించింది. సమీర్కుమార్ 1999లో అమెజాన్లో చేరారు. 2013లో Amazon.in ను తీసుకొచ్చిన బృంద సభ్యుల్లో ఈయన కూడా ఒకరు. మనీశ్ తివారీ రాజీనామా అనంతరం ఆ స్థానంలో సమీర్కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.