
పాలకుర్తి
జనగామ: యువతే ఈ దేశ భవిష్యత్తు: ఝాన్సీ రెడ్డి
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని వివిధ గ్రామాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులతో ఆదివారం మండల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి హాజరై మండల స్థాయి యువజన నాయకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతే ఈ దేశ భవిష్యత్తు అని, అందుకే మీరు నిరంతరం ప్రజలతో మమేకమై ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.