
జీవాలు పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
చలికాలంలో జీవాలకు వ్యాధులు సోకకుండా గాలి, వెలుతురు సరిగ్గా వచ్చే విధంగా చూడాలి. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు జీవాలను బయటకు వదలకూడదు. పాకలను శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాధులు సోకినప్పుడు పశు వైద్యాధికారులను సంప్రదించాలి. చలికాలంలో పీపీఆర్ వ్యాధి సోకిన జీవాలు పారిన ద్రవాలతో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. దీంతో జీవాలు నాలుగు రోజుల్లోనే చనిపోయే అవకాశం ఉంటుంది. ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.