IND vs BAN.. భారీ స్కోర్ దిశగా భారత్
భారత స్టార్ ఆల్‌రౌండర్లు అశ్విన్(75*), రవీంద్ర జడేజా(51*)లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. చెన్నైలోని చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ప్రస్తుతం టీమిండియా స్కోర్ 275/6 చేసింది. కాగా, టాస్ ఓడిన భారత్‌ను బంగ్లా బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. జైస్వాల్ 56, రోహిత్ 6, గిల్ 0, కోహ్లీ 6, పంత్ 39, కేఎల్ రాహుల్ 16 పరుగులు చేసి ఔటయ్యారు.