నేడు, రేపు అతిభారీ వర్షాలు
బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడనుంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనిస్తూ రెండు రోజుల్లో వాయిగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో శుక్ర, శని వారాల్లో ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.