మెదక్ నియోజకవర్గం
రక్తదాన శిబిరంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సిద్దిపేట పట్టణములోనీ ఎన్ఎస్వి బ్లడ్ బ్యాంక్ లో నిర్వహించిన రక్తదాన శిబిరం లో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ప్రజానికి తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మోడీ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సేవా కార్యక్రమాలు వారం రోజులపాటు నిర్వహిస్తామన్నారు.