
75 ఏళ్లలో.. ఇదే అద్బుతమైన బడ్జెట్: బండి సంజయ్
గడిచిన 75 ఏళ్లలో మునుపెన్నడూ లేనివిధంగా మధ్యతరగతికి అనుకూలమైన బడ్జెట్ ఇదేనని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్ అన్నారు. రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మకం అని తెలిపారు. తెలంగాణలో 50 లక్షల మందికిపైగా రైతులకు రూ.5 లక్షదాకా రుణం పొందే అవకాశం ఉందని.. అందరూ కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని కేంద్రమంత్రి సూచించారు.