వీడియోలు


తెలంగాణ
Top 10 viral news 🔥
‘2047 నాటికి 30 లక్షలకు పైగా కొత్త CAలు అవసరం’
Mar 13, 2024, 08:03 IST/

‘2047 నాటికి 30 లక్షలకు పైగా కొత్త CAలు అవసరం’

Mar 13, 2024, 08:03 IST
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కొత్త ప్రెసిడెంట్ రంజీత్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ మన ఆర్థిక వ్యవస్థలో ప్రతి ఒక ట్రిలియన్ డాలర్ల వృద్ధికి, 1 లక్ష మంది చార్టర్డ్ అకౌంటెంట్ల అవసరం ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు (2047) పూర్తయ్యే సమయానికి 30 లక్షల మంది సీఏల అవసరం ఉంటుంది’ అని అగర్వాల్ అన్నారు. ‘ప్రస్తుతం ICAI కింద నాలుగు లక్షల మంది CA సభ్యులు నమోదు చేసుకున్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ఆకర్షించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. “మేము భారతదేశం అంతటా 500 కంటే ఎక్కువ కళాశాలలు, పాఠశాలలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాము. ఈ ఒప్పందాల ప్రకారం, మేము స్థానిక అధ్యాపకులను నియమించుకుంటాము. వారికి అవసరమైన మద్దతునిస్తున్నాము. తద్వారా వారు వారి సొంత పాఠశాలలు, కళాశాలల్లో CA కోర్సులను బోధించవచ్చు’’ అని పేర్కొన్నారు. ఇక గత సంవత్సరంలో విద్యార్థులను చేర్చడంలో ICAI సాధించిన పురోగతిని కూడా అగర్వాల్ ప్రకటించారు. 2023లో కొత్తగా అర్హత పొందిన 22,000 మంది చార్టర్డ్ అకౌంటెంట్లలో, 138 కంపెనీలు ఆఫర్‌లు చేసిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లలో 9,000 మందికి పైగా విద్యార్థులను నియమించుకున్నారని చెప్పారు. భారతదేశంలో ఒక విద్యార్థికి అత్యధికంగా రూ.24 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినట్టు చెప్పారు. అదే సమయంలో విదేశాలలో అత్యధిక ప్యాకేజీ సంవత్సరానికి రూ.41 లక్షలుగా ఉందని వెల్లడించారు. విద్యార్థులందరికీ కలిపి గతేడాది సగటు ప్యాకేజీ ఏడాదికి రూ.12 లక్షలుగా ఉందన్నారు. విద్యార్థులను మరింత ప్రోత్సాహం అందించేందుకు పలు రాష్ట్రాల్లో ప్రత్యేక రాయితీలు కూడా ఇస్తున్నట్టు వివరించారు.