కౌంటింగ్ రోజు ఏపీలో 144 సెక్షన్: సీఈఓ

61చూసినవారు
కౌంటింగ్ రోజు ఏపీలో 144 సెక్షన్: సీఈఓ
ఓట్ల లెక్కింపు రోజు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ‘స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నాం. కౌంటింగ్ రోజు డ్రై డే అమలు చేస్తున్నాం. పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్