ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 17 ఓవర్లో బుమ్రా బెన్ డకెట్‌కు అద్బుతమైన డెలివరీని సంధించాడు. ఎల్బీకి అపీల్ చేయగా అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. రివ్యూ కోసం రోహిత్ కీపర్ కేఎస్ భరత్ సలహా కోరాడు. వద్దు అనటంతో ఆగిపోయారు. రీప్లేలో బంతి లెగ్ స్టంప్‌ను తాకుతున్నట్లు తేలింది. ఇది చూసిన బుమ్రా నేను చెప్పా కదా అది ఔట్ అని అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఓవర్ వేసిన బుమ్రా డకెట్‌ను బౌల్డ్ చేశాడు.