పొంగిన వాగు సుడిమెట్ట వంతెనపై రాకపోకలకు ఇబ్బందులు

61చూసినవారు
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జి. మాడుగుల మండలంలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆదివారం మండలంలోని మద్దిగరువు సుడిమెట్టకు మధ్య వాగు పొంగి వంతెనపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆయా గ్రామాల గిరిజనులకు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటు గెడ్డ ఒడ్డుపైనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి హైలెవెల్ వంతెన నిర్మాణం చేపట్టి తమ కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్