పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు పడిగాపులు

63చూసినవారు
పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు పడిగాపులు
పెదబయలు మండలంలోని పింఛన్ల సొమ్ము తీసుకోవడానికి లబ్ధిదారులు పడరాని పాట్లు పడుతున్నారు. పింఛన్ సొమ్ములను ఈనెల బ్యాంకులో వేయడంతో ఆ సొమ్ము తీసుకోవడానికి పింఛన్ దారులు శనివారం పడిగాపులు కాశారు. వృద్ధులు వికలాంగులు ఎండను తాళలేక బ్యాంకులో రద్దీగా ఉండడంతో గంటలపాటు బ్యాంకుల్లో క్యూలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. మండుటెండలో గంటలు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వృద్ధులు వికలాంగులు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్