మన్యం సేంద్రియ రైతు సహకార సంఘాలకు అవగాహన కార్యక్రమం

75చూసినవారు
మన్యం సేంద్రియ రైతు సహకార సంఘాలకు అవగాహన  కార్యక్రమం
పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీ పరిధి పెదగొంది గ్రామంలో " శ్రీ ధనలక్ష్మి" మన్యం సేంద్రియ రైతు సహకార సంఘం సభ్యులకు శనివారం ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పెదబయలు మండల ఫీల్డ్- కో-ఆర్డినేటర్ ఎస్. భీముడు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ మన్యం సేంద్రీయ రైతు సహకార సంఘము ఐక్యమత్యంగా ఉండి ఉమ్మడి సమస్యలను పరిష్కరించుకోవచ్చని వ్యక్తిగతంగా ఒకరి నుండి మరొకరు పరస్పర సహకారాన్ని పొందవచ్చన్నారు. సేంద్రియ వ్యవసాయ విధానాలను నేర్చుకుని అవలంబించడం ద్వారా ఖర్చు తగ్గి పంట నాణ్యత ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. రైతు ఉత్పత్తులను గ్రామంలోనే అమ్ముకోవచ్చనీ కొలతల్లో కోత లేకుండా ప్రతి కిలోకి నాణ్యమైన ధరను పొందొచ్చని ఉత్పత్తి విలువలు పెంచడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని ఆదివాసి రైతు ఉత్పత్తులకు ఒక గుర్తింపును తీసుకోరావచ్చు అన్నారు. పొదుపు చేసుకోవడం ద్వారా వాటా రూపంలో పెట్టుబడి పెట్టవచ్చని సంస్థ లాభాలలో వాటాను పొందవచ్చు అని ఆర్థిక అవసరాలకు అప్పు పొంది సులువైన వాయిదాలను చెల్లించవచ్చని తెలిపారు. వ్యాపారాల్లో నూతన పద్ధతుల అవకాశాల పై శిక్షణ సహకారము పొంది కలిసికట్టుగా అందరూ అభివృద్ధి చెందవచ్చు అని వివరించారు. సంఘం సభ్యులు 21 మంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్