ముంజమామిడి గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

69చూసినవారు
ముంజమామిడి గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
జి. మాడుగుల మండలంలోని గెమ్మేలి పంచాయతీ పరిధి ముంజమామిడిలో ఆశా కార్యకర్త పూర్ణ ఆధ్వర్యంలో గిరిజనులు శుక్రవారం ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇందులో భాగంగా గిరిజనులు డ్రైనేజీల్లోని మురుగుతోపాటు గ్రామంలోని బిందెల్లో నీటి కుంటల్లో నీటి నిల్వలను తొలగించి శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఆశా కార్యకర్త పూర్ణ మాట్లాడుతూ గ్రామంలోని కాలువల్లో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్