విశాఖ విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ 2041లో భీమిలిలోని నేరెళ్లవలస గ్రామంలో 70 మీటర్ల రోడ్, బీచ్ కారిడార్ రోడ్డును తొలగించాలని కోరుతూ అక్కడి లే అవుట్ ప్లాట్ల యజమానులు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. తామంతా ప్లాట్ లు కొనుగోలు చేశామని, ఈ లే అవుట్ గుండా వెళ్లే మాస్టర్ ప్లాన్ లో 70 మీటర్ల రహదారి వేస్తామని చెప్పడం అన్యాయమని పేర్కొన్నారు.