నర్సీపట్నంలో ఈనెల 23న జరిగే శ్రీ మరిడమ్మ అమ్మవారి పండుగను విజయవంతం చేయాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. మంగళవారం ఆలయ కమిటీతో సమావేశమై మాట్లాడారు. పూర్వీకుల నుంచి ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. తక్కువ సమయం ఉందని, కావున ఈ పండుగను విజయవంతం చేసే బాధ్యతను కమిటీ సభ్యులు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.