నర్సీపట్నంలో ఉగాది పర్వదినం పురస్కరించుకుని మంగళవారం పలు దేవాలయం వద్ద భక్తుల తాకిడి కనిపించింది. తెలుగు సంవత్సరాది కావడంతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఛైర్మన్ తాడికొండ బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని భక్తులకు పంపిణీ చేశారు. ప్రధాన అర్చకులు శరత్ కుమార్ ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.