మండల కేంద్రమైన నక్కపల్లి ఇసుక డిపోవద్ద దాదాపుగా 30వేల టన్నుల ఇసుక నిల్వలు సిద్ధంగా వున్నాయి. గత పక్షం రోజుల్లోనూ వందలాది లారీలతో సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ లారీల్లో గోదావరి ఇసుకను రాజమహేంద్రవరం నుంచి తీసుకువచ్చింది. గతంలో టన్ను ఇసుక ధర రూ. 1400 వుండగా, ప్రస్తుతం రూ 200 తగ్గించి, టన్ను ఇసుక రూ. 1200లకే ఇస్తున్నారు. ఎస్. రాయవరం, నక్కపల్లి మండలాలకు చెందిన అనేక మంది ఇసుక కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు.