మునగపాక మండలంలోని చూచుకొండ గ్రామంలో శనివారం గొంతెమ్మ తల్లి పండుగ మహోత్సవంను శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి గ్రామంలో పెద్ద ఎత్తున ఘట్టాలు భజనలతో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.