అంగరంగ వైభవంగా అక్కమ్మ దేవతల జాతర

1932చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణ శివారులలో వెలసిన అక్కమ్మ దేవతల జాతర బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అక్కమ్మ దేవతలకు పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి మొక్కుబడి ఉన్న భక్తులు ఎండను సైతం లెక్కచేయకుండా కలశాలు మోసుకొని వచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డి. ఎస్. పి తన సిబ్బందితో గట్టు బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్