ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, పెనుకొండ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ శనివారం ధర్మవరం పట్టణంలో పర్యటించారు. ధర్మవరం పట్టణానికి చెందిన ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ
విద్యార్థులు ఉన్నత చదువులు చదివి సమాజానికి ఉపయోగపడేలా మారాలన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఎంఈఓ గోపాల్ నాయక్ పాల్గొన్నారు.