రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండడంతో గుంతకల్లు పట్టణంలోని పాత బస్టాండు శ్రీ పోలేరమ్మ గుడి వద్ద సోమవారం బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కొలిమి రామాంజినేయులు ఆధ్వర్యంలో కేకుకోసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ స్వామి ముఖ్య అతిథిగా హాజరై మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వడ్డే రమేష్, పురంధర తదితరులు పాల్గొన్నారు.