హిందూపురం పట్టణంలోని గాంధీ సర్కిల్ నుండి ఈఎస్ఐ హాస్పిటల్ వరకు సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈఎస్ఐ హాస్పిటల్ నందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశేట్టిపల్లి వినోద్ కుమార్, జిల్లా కోశాధికారి డి. బాబు, ఉపాధ్యక్షులు చౌలూరు రవికుమార్ మాట్లాడుతూ హిందూపురంలో దశాబ్దాల కాలం నుంచి అద్దె భవనంలోనే ఈఎస్ఐ డిస్పెన్సరీ నిర్వహిస్తుండటం శోచనీయం అన్నారు.