
హిందూపురం: నీటి సరఫరా పర్యవేక్షించిన మున్సిపల్ చైర్ పర్సన్
హిందూపురం పురపాలక సంఘం పరిధిలో కొల్లకుంట దగ్గర ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని మునిసిపల్ చైర్ పర్సన్ డిఈ రమేష్ కుమార్, మునిసిపల్ కమిషనర్ సంఘం శ్రీనివాసులు బుధవారం పర్యవేక్షించారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుండి వచ్చే నీటిని ఫిల్టర్ బెడ్స్ ద్వారా పరిశుభ్రం చేసి నీటిని సరఫరా చేసే ప్రక్రియను పరిశీలించారు. ఫిల్టర్ బెడ్స్, శుద్ధి యంత్రాలు, మోటార్లను మరమ్మత్తులు చేయించి, నీటి సరఫరా జరుగుతుందని తెలియజేశారు.