కళ్యాణదుర్గం ప్రజావేదిక కార్యాలయం వద్ద హార్టికల్చర్ పీడీ, హార్టికల్చర్ సిబ్బంది, ఎంపీడీవోలు, ఉపాధి సిబ్బందితో బుధవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు సమావేశం నిర్వహించారు. కళ్యాణదుర్గం హార్టికల్చర్ అభివృద్ధి కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అందులో భాగంగానే మన నియోజకవర్గానికి హార్టికల్చర్ ద్వారా 3, 550 ఎకరాలలో పండ్ల మొక్కల పెంపకానికి అనుమతులు వచ్చాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.