కళ్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు శనివారం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు చీపుర్లు చేతబట్టి పట్టణంలోని టీ సర్కిల్ వద్ద నుంచి ప్రధాన వీధుల్లో చెత్తాచెదారాన్ని తొలగించారు.