కుందుర్పి మండలం మాయదార్లపల్లికి చెందిన వలస మూర్తి కుమారుడు రోహిత్ 18వ ఆలిండియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ నెల 7వ తేది నుంచి 9వ తేది వరకు గోవాలో ఆల్ ఇండియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రోహిత్ అత్యంత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ విషయాన్ని రోహిత్ తండ్రి వలస మూర్తి మంగళవారం విలేఖరులకు తెలిపారు.