ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి యువకుడు మృతి

69చూసినవారు
ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి యువకుడు మృతి
పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి సంతోష్ బాబు(17) సోమవారం మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు అందించిన సమాచారం మేరకు పెనుకొండ శ్రీరాములయ్య కాలనీకి చెందిన మల్లికార్జున కుమారుడు సంతోష్ బాబు గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మరణించాడు. గమనించిన స్థానికులు మృతదేహన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం పెనుకొండకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్