రాప్తాడు బీసీ హాస్టల్ విద్యార్థులకు మత్తు పదార్థాలపై సీఐ శ్రీ హర్ష అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ. గంజాయి, మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వాడకం వల్ల అనారోగ్యం సమస్యలు తలెత్తి జీవితాలు నాశనమవుతాయని అన్నారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా అందరు శ్రద్దగా చదువుకోవాలని కోరారు.