ఆత్మకూరు మండలంలో శనివారం దారుణ హత్యకు గురైన యువతి ఎవరో పోలీసులు కనిపెట్టేసారు. పోలీసులు ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ ఆమె గుమ్మఘట్ట మండలం సిరిగే దొడ్డి గ్రామానికి చెందిన సరితగా గుర్తించారు. అయితే సరితను ఎవరు, ఎందుకు హత్య చేశారు? ఎక్కడైనా హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడికి తెచ్చి పడేశారా వంటి వివరాలన్నీ పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.