భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి

62చూసినవారు
భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి
రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ కి ఇన్ఫ్లో కొనసాగుతోందని సంబంధిత శాఖ ఏఈ హరీష్ మంగళవారం మీడియాకి ఓ ప్రకటనలో తెలిపారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీటీ ప్రాజెక్టు కి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1655 అడుగులు కాగా ప్రస్తుతం1644. 65 అడుగులకు నీరు చేరిందన్నారు. 80 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్