కణేకల్ మండలం ఎక్సైజ్ సీఐగా బాధ్యతలు చేపట్టిన ఆర్. ఉమాదేవి

76చూసినవారు
కణేకల్ మండలం ఎక్సైజ్ సీఐగా బాధ్యతలు చేపట్టిన ఆర్. ఉమాదేవి
కణేకల్ మండలం ఎక్సైజ్ సీఐగా ఆర్. ఉమాదేవి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆమె రాయచోటి నందు ఇంటలిజెన్స్ వింగ్ నుండి ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కణేకల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐగా బదిలీపై వచ్చారు. సిఐకి ఎక్సైజ్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఆమె మాట్లాడుతూ మండలంలో ఎక్కడా అక్రమ మద్యంకు తావు లేకుండా బాధ్యతలు నిర్వహిస్తానని తెలిపారు. అక్రమ మద్యంను అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్