రైతన్నలకు యాజమాన్యాలు నష్టపరిహారం పెంచాల్సిందే: సిపిఐ

58చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహల్, డి హీరేహల్ మండలాలలో పొలాలకు సమీపంగా గత కొన్నేళ్లుగా ఏర్పాటు చేసిన స్పాంజ్ ఐరన్ పరిశ్రమల యాజమాన్యాలు రైతన్నలకు నష్టపరిహారం పెంచాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగార్జున డిమాండ్ చేశారు. సోమవారం ఫ్యాక్టరీల వల్ల నష్టపోతున్న రైతన్నల పొలాలను సిపిఐ ఏపీ రైతు సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు. 20 నుంచి 30వేలు రైతన్నలకు పంట నష్ట పరిహార డబ్బులు అందించాలని డిమాండ్ చేశారు.