గార్లదిన్నె: ఇద్దరు దొంగల అరెస్టు

55చూసినవారు
గార్లదిన్నెలో పొలాల వద్ద స్టారర్ పెట్టెల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సీఐ కౌలుట్లయ్య, ఎస్సై మహ్మమద్ గౌస్ మీడియా సమావేశం నిర్వహించారు. మర్తాడుకు చెందిన ఇద్దరు బూదేడు, ఎర్రగుంట్ల, కల్లూరు గ్రామాలలో చోరీకి పాల్పడ్డారన్నారు. స్టాటర్ పెట్టెలు రికవరీ చేసి రైతులకు అందించామన్నారు. రైతులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్