ధర్మవరం పట్టణంలో ఈనెల 29వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ ధర్మవరం కోర్టు ప్రాంగణంలో ఈనెల 29న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి పోలీసులు లాయర్లు అందరూ హాజరు అవ్వాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసులను ఈ లోక అదాలత్ తో పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు.