అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి వద్ద టిప్పర్ ఢీకొని ఓపెన్ ఎయిర్ జైలో శిక్ష అనుభవిస్తున్న ఈరన్న (50) మృతి చెందాడు. ఖైదీ మృతిపై సోమవారం అధికారులు వెల్లడించారు. మృతుడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చెందినవాడిగా తెలియజేశారు. సైకిల్ పై వెలుతున్న ఈరన్నని టిప్పర్ ఢీకొనడంతో ఖైదీ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.