రబీ సీజన్ లో రైతులు సాగు చేసేందుకు 50 శాతం సబ్సిడీతో పప్పుశనగ విత్తనాలను పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం, కౌలు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పుట్లూరు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వర్షాలు కురవక సక్రమంగా పంటలు సాగు చేయని నేపథ్యంలో కనీసం రబీలో నైనా పంటలు సాగు చేసేందుకు పప్పు శనగ విత్తనాలను 50 నుంచి 60 శాతం సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్ చేశారు.