తాడిపత్రిలో గత కొద్దిరోజులుగా వరస చోరీలు జరుగుతున్నాయి. తాజాగా పుట్లూరు మండలం సూరేపల్లి కి చెందిన ఆంజనేయులు పట్టణంలోని కెనరా బ్యాంక్ నుంచి నగదు డ్రా చేసి సీబీ రోడ్డు ప్రశాంతి షూ మార్ట్ వద్ద చెప్పులు కొనుగోలు చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు నగదు ఉన్న బ్యాగ్ ను దోచుకెళ్లారు. బ్యాగ్ లో దాదాపు రూ. 60వేలు నగదు ఉందని, వారు పథకం ప్రకారమే బైక్కు ఉన్న ప్లగ్ తీసివేసి దోచుకెళ్లారని తెలిపారు.