శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు

77చూసినవారు
అనంతపురం జిల్లాలో దక్షిణ కాశీగా పిలవబడుతూ తాడిపత్రిలో పెన్నానది ఒడ్డున వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారు జామున అర్చకులు శంకరయ్య, గిరి, శేషులు గంగా జలాభిషేకం, అర్చనలు నిర్వహించి వివిధ పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు

సంబంధిత పోస్ట్